సోషల్ మీడియాలో పాపులారిటీ కొసం కొందరు చేస్తున్న పనులు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. సోషల్‌ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొందరు ఏకంగా తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు కూడా ఈమధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చేస్తున్న కోతి పనుల కారణంగా జైలుకు కూడా వెళ్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తానికి సోషల్ మీడియా వ్యామోహం ఈ మధ్య యువతలో ఎక్కువ అవుతుంది. తాజాగా జరిగిన ఒక సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడానికా లేదా మరేదైనా కారణమా అనేది తెలియదు కానీ పెళ్లి తంతులో జరిగిన సంఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇంటర్నెట్‌ ప్రపంచంలో తెగ వైరల్‌ అవుతోంది. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్‌ జిల్లా తాడుర్‌ మండలం ఐతోల్‌ గ్రామంకు చెందిన యువకుడి పెళ్లి ఖరారు అయ్యింది. ఈమధ్య కాలంలో పెళ్లికి హల్దీ కార్యక్రమం ప్రధానంగా చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో బంధు మిత్రులు అంతా కూడా సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. పెళ్లిలో ఎంజాయ్ చేసే అతి ముఖ్యమైన ఘటంగా మంగళస్నానాలను ఈమధ్య వాడేసుకుంటున్నారు. 


పెళ్లి కొడుకు మంగళ స్నానంలో బందువులతో పాటు అతడి మిత్రులు కూడా పాల్గొన్నారు. మంగళ స్నానంలో భాగంగా మూలతో ఉన్న నీటిని పెళ్లి పిల్ల లేదా పెళ్లి కొడుకు పై పోస్తారు. కానీ ఐతోల్ గ్రామంకు చెందిన వరుడికి బీరు తో మంగళ స్నానం చేయించారు. ఆ వరుడికి కూడా ఆ విషయం ముందు తెలియనట్లుంది.. బీర్ మీద పోసిన వెంటనే షాక్ అయ్యాడు. 


Also Read: Ys Viveka Murder Case: అవినాష్ రెడ్డికి షాక్, ముందస్తు బెయిల్ విచారణకు సుప్రీం నో


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. యువకులు అలా చేస్తూ ఉంటే అక్కడ ఉన్న పెద్ద వారు ఏం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన మంగళ స్నానంను ఇలా అపహాస్యం చేయడం ఏంట్రా బాబు అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. 


ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎన్ని చూడాల్సి ఉందో అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూ వివాహ పద్దతి యొక్క పరువు తీసిన సదరు యువకులను కఠినంగా శిక్షించాలంటూ కొందరు డిమాండ్‌ చేస్తూ ఉన్నారు. మండు వేసవిలో బీరు తాగితే పర్వాలేదు కానీ ఇలా మంగళ స్నానం చేయించడం ఎందుకురా అని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


మొత్తానికి పెళ్లి అనే పవిత్ర తంతులో మద్యం ను పారించడం ఎంత వరకు సరైన పద్దతి అనేది ఈతరం యువత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరిని చూసి ఒకరు అన్నట్లుగా ఈ సంఘటన చూసి కచ్చితంగా ముందు ముందు మరింత మంది తమ స్నేహితులకు బీర్ తో మంగళ స్నానం చేయించడం లేదంటే మరేదైనా కొత్త వింత కార్యక్రమం చేసినా ఆశ్చర్యం లేదు. కనుక ఈ సంఘటన విషయంలో మినిమం చర్యలు అయినా తీసుకోవాలని కొందరు కోరుకుంటున్నారు.


Also Read: Bandi Sanjay Speech: కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే.. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి: బండి సంజయ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook